Kangana Tweet: కమల్‌ ఎన్నికల హామీపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్‌ క్వీన్‌… కావాల్సింది వేతనం కాదు గౌరవం అంటూ..

|

Jan 06, 2021 | 2:00 PM

Kangana Comments On Kamal: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత తన షాకింగ్‌ కామెంట్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు..

Kangana Tweet: కమల్‌ ఎన్నికల హామీపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్‌ క్వీన్‌... కావాల్సింది వేతనం కాదు గౌరవం అంటూ..
Follow us on

Kangana Comments On Kamal: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత తన షాకింగ్‌ కామెంట్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్‌ తార కంగనా రనౌత్‌. ఇక అనంతరం ఏదో సమస్యపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారీ స్టార్‌ హీరోయిన్‌. ముంబై పీఓకేను తలపిస్తుందంటూ ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగారు.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న కంగానా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీని స్థాపించి తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్‌ హాసన్‌ ప్రజలకు హామీలు ఇస్తూ.. ‘తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని’ హామీ ఇచ్చారు. తాజాగా ఈ విషయంపై కంగనా ఘాటుగా స్పందించారు. కమల్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాజీ మంత్రి శశి థరూర్ చేసిన పోస్టుకు రిప్లై ఇచ్చారు కంగనా.

కమల్‌ ఇచ్చిన హామీపై కంగనా రనౌత్‌ స్పందన.

ఈ విషయమై కంగనా ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రతి దాన్ని వ్యాపారంలాగా మార్చకండి. భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు… సమాజంలో గౌరవం. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్నా మీ ఆలోచనలను మార్చుకోండి’ అంటూ తనదైన శైలిలో స్పందించారు.

Also Read: నేను నిందితురాలిని కాదు, నీరవ్ మోడీ కేసులో అప్రూవర్ గా మారుతున్న సోదరి పుర్వి మోడీ ,కోర్టు సమ్మతి