2021 అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీదే ఘనవిజయం: కమల్ హాసన్

|

Nov 05, 2020 | 2:43 PM

మక్కల్ నీధి మయం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజకీయపార్టీ ప్రస్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా తన పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. అసెంబ్లీ లో తన గొంతుని బలంగా వినిపిస్తానని చెప్పారు. తమిళనాడు లో మూడో అతిపెద్ద పార్టీగా తమ పార్టీ తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల భవిష్యతు మెరుగుపరచడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కి అడుగులు వేస్తున్నానని కమల్ వివరించారు.” […]

2021 అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీదే ఘనవిజయం: కమల్ హాసన్
Follow us on

మక్కల్ నీధి మయం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన రాజకీయపార్టీ ప్రస్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా తన పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. అసెంబ్లీ లో తన గొంతుని బలంగా వినిపిస్తానని చెప్పారు. తమిళనాడు లో మూడో అతిపెద్ద పార్టీగా తమ పార్టీ తయారవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల భవిష్యతు మెరుగుపరచడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కి అడుగులు వేస్తున్నానని కమల్ వివరించారు.” నేను బిజెపి బి టీం అని చెప్పడం దారుణం .. నేను ఎవ్వరికి బి టీం కాదు. నా మిత్రుడు రజినీకాంత్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటాను. ఒక మంచి వ్యక్తి రాజకీయాలకు వస్తే బాగుంటుంది. రజినీకాంత్ పార్టీ పెట్టినా , పెట్టకపోయినా నేను మద్దతు తప్పకుండా కోరుకుంటాను. డీఎంకే పార్టీ తో కూటమికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగడం లేదు. నవంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. నా పార్టీ సిద్దాంతాలను నమ్మి ఎవరు మాతో కూటమికి వచ్చినా మాకు సమ్మతమే”. అని కమల్ అన్నారు.