దిల్‌ రాజు నిర్మాణంలో నందమూరి హీరో… లక్కీ ప్రొడ్యుసర్‌ అయినా హిట్‌ ఇస్తాడో చూడాలి.

|

Dec 28, 2020 | 8:26 PM

'ఇజం' నుంచి 'ఎంత మంచి వాడవురా' వరకు వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన '118' కూడా కళ్యాణ్‌ రామ్‌కు ఆశించిన స్థాయి విజయాన్ని..

దిల్‌ రాజు నిర్మాణంలో నందమూరి హీరో... లక్కీ ప్రొడ్యుసర్‌ అయినా హిట్‌ ఇస్తాడో చూడాలి.
Follow us on

kalyan ram new movie in dil raju banner: ‘ఇజం’ నుంచి ‘ఎంత మంచి వాడవురా’ వరకు వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోర్లాపడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘118’ కూడా కళ్యాణ్‌ రామ్‌కు ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందించలేకపోయింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్‌ తర్వాత కళ్యాణ్ మళ్లీ ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడే చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న ఈ హీరో.. కొత్త దర్శకుడు విశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ రామ్‌ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా సినిమా విడుదల కంటే ముందే మరో సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు కళ్యాణ్‌ రామ్‌. ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు చిత్ర టైటిల్‌గా ‘డూ ఆర్ డై’ అనే టైటిల్‌ను కూడా సినిమా యూనిట్‌ పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి లక్కీ ప్రొడ్యుసర్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌ రాజు అయినా.. కళ్యాణ్‌ రామ్‌కు విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.