నాంపల్లి దర్గాలో మొక్కులు చెల్లించిన కవిత

|

Oct 11, 2020 | 6:31 PM

హైదరాబాద్‌ నాంపల్లి యూసిఫియన్‌ దర్గాను మాజీ ఎంపీ కవిత దర్శించుకున్నారు. దర్గాను సందర్శించిన కవిత చాదర్‌ సమర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీమ్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్

నాంపల్లి దర్గాలో మొక్కులు చెల్లించిన కవిత
Follow us on

Kalvakuntla Kavitha : హైదరాబాద్‌ నాంపల్లి యూసిఫియన్‌ దర్గాను మాజీ ఎంపీ కవిత దర్శించుకున్నారు. దర్గాను సందర్శించిన కవిత చాదర్‌ సమర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీమ్, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కవితకు స్వాగతం పలికారు. ప్రతి ఎన్నికల ఫలితాల ముందు దర్గాను సందర్శించిన కవితకు ఆనవాయితీ. దీనిలో భాగంగానే రేపటి ఫలితాల నేపథ్యంలో యూసీఫీయన్‌ దర్గాకు మొక్కులు చెల్లించారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితం రేపే తేలనుంది. ఈ నేపథ్యంలో కవిత దర్గాకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో కవిత గెలుపు లాంఛనమే కానుంది. మెజార్టీ స్థానిక సంస్థల సభ్యులు టీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంతో ఆమె విజయం నల్లేరుపై నడకలా మారింది. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ మెజార్టీ సాధిస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.