పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌

|

Aug 17, 2020 | 7:35 AM

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వరద ఉదృతి పెర‌గ‌డంతో నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు అధికారులు. ప్రాజెక్టు 6, 7, 9, 10, 17 గేట్స్ ను 5 అడుగులు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. రాయపట్నం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం:700 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 696.875 అడుగులు

ప్రాజెక్టు కెపాసిటీ: 7.603 టీఎంసీలు
ప్రస్తుతం: 6.812 టీఎంసీలు

ఇన్ ఫ్లో: 28467 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 31890 క్యూసెక్కులు

 

Also Read :

సచివాలయ సేవలకు ఐరాస సహకారం