కడప జిల్లాలో కరోనా కలవరం..!

|

Jun 22, 2020 | 3:26 PM

కడప జిల్లాలో కరోనా వైరస్ కేసలు సంఖ్య పెరుగుతుండడంతో కలవరం సృష్టిస్తోంది. ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు.

కడప జిల్లాలో కరోనా కలవరం..!
Follow us on

కడప జిల్లాలో కరోనా వైరస్ కేసలు సంఖ్య పెరుగుతుండడంతో కలవరం సృష్టిస్తోంది. ఓ పెళ్లికి వెళ్లి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. పుల్లంపేటకు చెందిన అన్నదమ్ములిద్దరూ ఇటీవల తాడిపత్రిలో ఓ వివాహానికి హాజరయ్యారు. ఇంటికి వచ్చిన ఇద్దరు అనారోగ్యానికి గురి కావడంతో.. స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి వద్దకు వెళ్లారు. దీంతో ఇద్దరికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా సోకినట్లు తెలిపారు. వీరిద్దరిని కడప ఫాతిమా కాలేజీ క్వారంటైన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పుల్లంపేట మండల సచివాలయంలో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌ గా తేలడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రెండు రోజుల క్రితం మనం-మన పరిశుభ్రత అనే కార్యక్రమం కింద స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు డిజిటల్‌ అసిస్టెంట్‌ కూడా హాజరైనట్లు అధికారులు తెలిపారు. అతనితో సన్నిహితంగా మెలిగిన సచివాలయ సిబ్బంది కరోనా సోకిందేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు.

ఇక వల్లూరు మండల పరిధిలోని కోట్లూరు గ్రామంలో ఒకరి నుంచి నలుగురికి కరోనా పాజిటివ్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15న గ్రామంలో ఒకరికి కరోనా సోకింది. అతని ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా అతని కుటుంబ సభ్యులకు టెస్టులు చేపట్టగా.. ఆదివారం నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. అటు వల్లూరులో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. వారి ప్రైమరీ కాంటాక్టు కింద ఆదివారం 11 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు ఆమె తెలిపారు.