ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి దర్శకేంద్రుడు రాజీనామా

| Edited By:

May 27, 2019 | 6:03 PM

శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయసు మీద పడుతుందని.. అందుకే ఈ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ అధికారులకు పంపారు. ఈ సందర్భంగా టీటీడీ యజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీస్సులు ఉండాలని.. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలని రాఘవేంద్రరావు తెలిపారు. కాగా ఎస్వీబీసీ ఛానల్‌ను టీటీడీ నిర్వహిస్తుండగా.. 2015 నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న దర్శకేంద్రుడు.. గత […]

ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి దర్శకేంద్రుడు రాజీనామా
Follow us on

శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయసు మీద పడుతుందని.. అందుకే ఈ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ అధికారులకు పంపారు. ఈ సందర్భంగా టీటీడీ యజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీస్సులు ఉండాలని.. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలని రాఘవేంద్రరావు తెలిపారు. కాగా ఎస్వీబీసీ ఛానల్‌ను టీటీడీ నిర్వహిస్తుండగా.. 2015 నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న దర్శకేంద్రుడు.. గత ఏడాది నుంచి ఎస్వీబీసీ  చానల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.