‘యూనివర్స‌ల్ బాస్‌’ను మరిపిస్తూ బుడతడి హార్డ్ హిట్టింగ్..

|

Sep 15, 2020 | 5:26 PM

'యూనివర్స్‌ల్ బాస్‌' గేల్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలే. ఇక తాజాగా గేల్‌ను మరిపిస్తూ ఓ బుడతడు చేసిన హార్డ్ హిట్టింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూనివర్స‌ల్ బాస్‌ను మరిపిస్తూ బుడతడి హార్డ్ హిట్టింగ్..
Follow us on

Junior Chris Gayle: ‘యూనివర్స్‌ల్ బాస్‌’ క్రికెట్‌కు ఈ పేరు సుపరిచితమే. విండీస్ ఓపెనర్ క్రిస్టోఫర్ హెన్రీ గేల్‌ను అభిమానులు ముద్దుగా ఈ పేరుతో పిలుచుకుంటారు. గేల్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలే. ఇక తాజాగా గేల్‌ను మరిపిస్తూ ఓ బుడతడు చేసిన హార్డ్ హిట్టింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిల్డింగ్ స్టెప్స్‌పైన బ్యాట్ పట్టుకుని ఉన్న ఈ బుడతడికి కొన్ని బంతులు వేస్తే భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడ్డాడు. ఈ చిన్నోడి హిట్టింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ”ఈ బుడతడు ఎంత బాగా ఆడుతున్నాడో ” అని అంటూ భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వీడియోను షేర్ చేశాడు. అచ్చం క్రిస్ గేల్ మాదిరిగానే హిట్టింగ్ చేస్తుందని కొందరు కామెంట్ చేయగా.. యువరాజ్ బ్యాటింగ్ శైలి పోలి ఉందని మరికొందరు అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ బుడతడి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.