జయరాం హత్య కేసు: శిఖా చౌదరికి క్లీన్‌చిట్

| Edited By:

May 01, 2019 | 1:36 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్నారై జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్‌చిట్ లభించింది. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డేనని తేల్చిన పోలీసులు కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు చార్జిషీట్‌లో దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 70మంది సాక్ష్యులను విచారించిన పోలీసులు.. 390 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను రూపొందించారు. అందులో రాకేశ్ రెడ్డితో పాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు […]

జయరాం హత్య కేసు: శిఖా చౌదరికి క్లీన్‌చిట్
Follow us on

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్నారై జయరాం హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి క్లీన్‌చిట్ లభించింది. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డేనని తేల్చిన పోలీసులు కార్మిక సంఘం నేత బీఎన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు చార్జిషీట్‌లో దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 70మంది సాక్ష్యులను విచారించిన పోలీసులు.. 390 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను రూపొందించారు. అందులో రాకేశ్ రెడ్డితో పాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్య ప్రసాద్, కిశోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు చేశారు. రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్‌ను పోలీసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా జనవరి 31న చిగురుపాటి జయరాం కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.