Covid 19 vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ టీకా.. ఆశాజనకంగా ఫలితాలు

| Edited By:

Sep 26, 2020 | 3:10 PM

ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అమెరికాకు చెందిన జాన్సన్ అండ్‌ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే

Covid 19 vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ టీకా.. ఆశాజనకంగా ఫలితాలు
Follow us on

ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అమెరికాకు చెందిన జాన్సన్ అండ్‌ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ మరో అడుగు ముందుకేసింది. బుధవారం మనుషులపై తుది దశ ప్రయోగపరీక్షలు ప్రారంభం కాగా.. ఆ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ మేరకు మధ్యంతర ఫలితాలను విడుదల చేసింది.

ప్రస్తుతం అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్‌, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60వేల మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ని ఇచ్చిన వాలంటీర్లలో వ్యాధి నిరోధక స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. చివరి దశ ప్రయోగాలు విజయవంతమైతే ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ఈ వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అయితే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వయస్సు మళ్లిన వారిపై ఈ టీకా పనిచేస్తుందా..? అన్ని రకాల వయస్సుల వారికి ఒకే డోస్ ఇవ్వడం వలన వ్యతిరేక ప్రభావాలు ఏవైనా కనిపిస్తాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలు తెలియాలంటే చివరిదశ ప్రయోగ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందేనని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.బ్యారీ బ్లూమ్ తెలిపారు.

Read More:

శ్రావణి కేసు: పోలీసుల కస్టడీకి సాయి కృష్ణ, దేవరాజ్‌

Breaking: ఇంట్లో జారి పడ్డ నన్నపనేని.. తలకు గాయం