బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులపై జేఎ‌న్టీ‌యూ-‌హెచ్‌ కీలక ప్రకటన..క్లాసుల నిర్వహణపై ఆదే‌శాలు

|

Nov 23, 2020 | 3:41 PM

బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులపై జేఎ‌న్టీ‌యూ‌హెచ్‌ కీలక ప్రకటన చేసింది. బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభంపై విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి..

బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులపై జేఎ‌న్టీ‌యూ-‌హెచ్‌ కీలక ప్రకటన..క్లాసుల నిర్వహణపై ఆదే‌శాలు
Follow us on

B.Tech First Year Classes : బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతులపై జేఎ‌న్టీ‌యూ‌హెచ్‌ కీలక ప్రకటన చేసింది. బీటెక్‌ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభంపై విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజి‌నీ‌రింగ్‌ అడ్మి‌షన్ల ప్రక్రియ ఈ నెలా‌ఖరుతో ముగి‌య‌నుంది.

అయితే.. వర్సిటీ, అఫి‌లి‌యే‌షన్‌ కాలే‌జీల ప్రిన్సి‌పా‌ళ్లకు షెడ్యూల్‌ ప్రకారం క్లాసుల నిర్వహణపై ఆదే‌శాలు జారీ చేస్తా‌మ‌ని జేఎన్టీయూహెచ్ రిజిస్టారర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ వెల్లడించారు.

ఇప్పటికే బీటెక్ సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను కరోనా నేపథయంలో విద్యా‌ర్థుల నివాస సమీప కాలే‌జీల్లో నిర్వహి‌స్తు‌న్నట్టు పేర్కొన్నారు. అవి ఈ నెలా‌ఖరు వరకు పూర్తవు‌తా‌యని, వచ్చే జన‌వ‌రిలో కొత్త సెమి‌స్టర్‌ పరీ‌క్షలు ప్రారంభం అవు‌తా‌యని తెలిపారు.