తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల

|

Sep 02, 2020 | 8:02 PM

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విధంగానే ముందుకు సాగుతోంది. రెండు రోజుల క్రితం టీఎస్ ఈసెట్..

తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిన విధంగానే ముందుకు సాగుతోంది. రెండు రోజుల క్రితం టీఎస్ ఈసెట్ (TS ESET) ను నిర్వహించింది. అయితే.. తాజాగా  తెలంగాణ ఎంసెట్ నిర్వహణ కోసం పరీక్షల తేదీలను సైతం జెఎన్టీయూ హెచ్ (JNTU) విడుదల చేసింది.

ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ 2020 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రేపటి నుండి ఈనెల7 వతేది వరకు www.eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అయితే ఈ ఎంసెట్ పరీక్షను ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 102 సెంటర్లలో నిర్వహించనున్నారు. తెలంగాణలో 79, ఏపీలో 23 పరీక్షా కేంద్రాలను టీఎస్ఎంసెట్ కోసం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 1,43,165 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని… కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలని తెలిపారు. కరోనా ఆంక్షలను పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటురని అన్నారు.