Reliance AGM 2019: ముఖేశ్ అంబానీ కీలక ప్రకటనలు..

| Edited By:

Aug 12, 2019 | 2:24 PM

ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల సమావేశం. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీతో సహా ఫ్యామిలీలోని అందరూ పాల్గొన్నారు. అలాగే.. రిలయ్స్ వాటాదారులు కూడా పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి ఇప్పటి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ముఖేష్ అంబానీ. ఈ సందర్భాగా ముఖేష్ అంబానీ మట్లాడుతూ.. గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించి రికార్డు సృష్టించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకమన్నారు. 2030 […]

Reliance AGM 2019: ముఖేశ్ అంబానీ కీలక ప్రకటనలు..
Follow us on

ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల సమావేశం. ఈ కార్యక్రమంలో రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీతో సహా ఫ్యామిలీలోని అందరూ పాల్గొన్నారు. అలాగే.. రిలయ్స్ వాటాదారులు కూడా పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించి ఇప్పటి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ముఖేష్ అంబానీ.

ఈ సందర్భాగా ముఖేష్ అంబానీ మట్లాడుతూ.. గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించి రికార్డు సృష్టించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం కీలకమన్నారు. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందన్నారు. రిలయన్స్ జియో 340 మిలియన్ల వినియోగదారులను దాటిందని పేర్కొన్నారు. రిటైల్ రంగంలో లక్షా 30 వేల కోట్ల బిజినెస్‌లు చేశామన్నారు.

కాగా.. పెట్రో కెమికల్స్‌లో సౌదీ అరాంకోతో ఒప్పదం చేసుకున్నామన్నారు ముఖేష్ అంబానీ. పెట్రోకెమికల్స్ విదేశీ పెట్టుబడుల్లో 20 శాతం వాటా పొందామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యమన్నారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ నెట్‌ వర్క్ సౌకర్యం అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమని చెప్పారు.

1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్
2. ప్రతిఒక్కరికి డిజిటల్ నెట్‌వర్క్ అందుబాటులోకి
3. సెప్టెంబర్ 5 నాటికి జియో ఆవిష్కరించి 3 మూడేళ్లు
4. త్వరలోనే అందుబాటులోకి జియో బ్రాడ్‌బ్యాండ్‌
5. 1600 పట్టణాల్లో 20 మిలియన్ల మందికి బ్యాడ్‌బ్యాండ్ కనెక్షన్లు
6. హోం బ్రాడ్ బ్యాండ్, 100జీబీ ఇంటర్నెట్, యూహెచ్‌డీ సెటాప్‌బాక్స్
7. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సర్వీసులు
8. రిలయన్స్ జియో ఫోన్‌ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్
9. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
10. రిలయన్స్ బ్రాడ్ బ్యాండ్ జియోగిగా ఫైబర్‌గా కమర్షియల్‌గా లాంచ్