జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సమ్మె హెచ్చరిక

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:56 PM

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లకు సంబంధించిన నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ సమ్మెసైరన్‌ మోగించింది. మార్చి1వ తేదీ నాటికి జీతాల చెల్లింపుపై స్పష్టతను ఇవ్వకపోతే సమ్మెకు దిగడంతోపాటు తమ సంస్థ సభ్యులు కచ్చితంగా రోస్టర్‌ విధానానికి కట్టుబడి ఉండాలని కోరతామని పేర్కొంది. ఫలితంగా డ్యూటీలకు సంబంధించి చివరి నిమిషంలో జరిగే మార్పులను వారు అంగీకరించరు. ఆర్థిక కష్టాలతో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇంజినీర్లు, పైలట్లు, […]

జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సమ్మె హెచ్చరిక
Follow us on

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లకు సంబంధించిన నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ సమ్మెసైరన్‌ మోగించింది. మార్చి1వ తేదీ నాటికి జీతాల చెల్లింపుపై స్పష్టతను ఇవ్వకపోతే సమ్మెకు దిగడంతోపాటు తమ సంస్థ సభ్యులు కచ్చితంగా రోస్టర్‌ విధానానికి కట్టుబడి ఉండాలని కోరతామని పేర్కొంది. ఫలితంగా డ్యూటీలకు సంబంధించి చివరి నిమిషంలో జరిగే మార్పులను వారు అంగీకరించరు.

ఆర్థిక కష్టాలతో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇంజినీర్లు, పైలట్లు, సీనియర్‌ మేనేజర్లకు భారీగా బకాయిపడింది. వీరికి ఫిబ్రవరిలో చెల్లిస్తానని హామీ ఇచ్చింది. దీనిలో డిసెంబర్‌కు సంబంధించిన జీతం 100శాతం, 25శాతం నవంబర్‌ బకాయిలు, దీంతోపాటు జనవరికి సంబంధించిన జీతంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. తాజాగా బ్యాంకుల నుంచి జెట్‌ రూ.500 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి మార్గం సుగమం కావడంతో పైలట్లు ఈ డిమాండ్‌ చేశారు.