రెబల్ స్థార్ పై పొగడ్తలవర్షం కురిపించిన జయరామ్.. ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్నికి ఫిదా అయిపోయిన నటుడు 

|

Nov 28, 2020 | 11:21 AM

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో  ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ రెబల్ స్టార్...

రెబల్ స్థార్ పై పొగడ్తలవర్షం కురిపించిన జయరామ్.. ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్నికి ఫిదా అయిపోయిన నటుడు 
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ స్థాయిలో  ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు ఈ రెబల్ స్టార్. ప్రభాస్ గురించి తెలిసిన వారందరు ఆయన్ను డార్లింగ్ అని పిలుస్తారు. ప్రభాస్ ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి ఇప్పటికే చాలా మంది తారలు పలుసార్లు చెప్పుకొచ్చారు.
తాజాగా నటుడు జయరామ్ కూడా ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇన్ స్టాగ్రమ్ లో ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రభాస్ తో దిగిన ఫొటోతోనే జయరామ్ ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ప్రభాస్ పట్టుదలను ప్రశంసించడమే గాక..ప్రభాస్ నిజాయితీ లోనూ సూపర్ అంటూ పొగిడేశారు. జయరామ్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని.. హృదయాన్ని తాకుతుందని జయరామ్ అన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్-ఇండియన్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది.