ఇక స్మారక కేంద్రంగా ‘జయలలిత’ నివాసం..

| Edited By:

May 06, 2020 | 5:10 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ను సేకరించేందుకు

ఇక స్మారక కేంద్రంగా జయలలిత నివాసం..
Follow us on

Veda Nilayam: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం తెలంగాణాలో లాక్ డౌన్ మే 29 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ను సేకరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసింది. పొయెస్ గార్డెన్‌లోని ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చేందుకు నిర్ణయించింది.

కాగా.. భూ సేకరణ అధికారి/రెవిన్యూ డివిజనల్ అధికారి సిఫారసు మేరకు ప్రభుత్వం /చెన్నై కలెక్టర్ ఈ భూమి, భవనాలు ప్రజా ప్రయోజనాల కోసం అవసరమని సంతృప్తి చెందినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ను ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చేందుకు అవసరమని తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల కుటుంబాలు నిర్వాసితులు కావడం, వారికి పునరావాసం కల్పించడం వంటివేవీ ఉండవని తెలిపింది.

Also Read: రైతులకు శుభవార్త.. వాళ్లందరికీ రుణ మాఫీ ..