పవన్ పిలుపుతో కదిలివచ్చిన జనసైనికులు

|

Sep 12, 2020 | 5:48 AM

అంతర్వేది ఘటనపై మరో ఆందోళనను జనసేన చేపట్టింది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే...

పవన్ పిలుపుతో కదిలివచ్చిన జనసైనికులు
Follow us on

అంతర్వేది ఘటనపై మరో ఆందోళనను జనసేన చేపట్టింది. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దీపాలు వెలిగించాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దర్యాప్తు అంటేనే గొడవ జరిగిందని అర్థం అంటూ వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పనం కాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని అంటూ పిలుపునిచ్చారు. దానివైపు వేసే తొలి అడుగే ఈ దీపాల ప్రజ్వలనం అని పవన్ పేర్కొన్నారు. ఆయన పిలుపుకు జనసేన కార్యకర్తలు, అభిమానుల నుంచి రాష్ట వ్యాప్తంగా మంచి స్పందన లభించింది.

పవన్ సైతం తన ఫాంహౌస్ లో ఓ దివ్వె వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని పరిరక్షిద్దాం-మతసామరస్యాన్ని కాపాడుకుందాం అంటూ స్వయంగా సంకల్పం చెప్పుకుంటూ పవన్ ధ్యానం చేశారు.

ఇక పవన్ పిలుపును పాటిస్తూ విశాఖపట్నం, నందిగామ, నెల్లూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, కైకలూరు తదితర ప్రాంతాల్లో జనసైనికులు తమ నివాసాల్లో దీపాలు వెలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతు తెలిపారు.