Janasena: తెలంగాణలో పోటీ చేసే సత్తా జనసేనకు ఉంది.. జనసేనాని పవన్ సెన్సేషనల్ కామెంట్స్

|

May 21, 2022 | 7:57 AM

దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అప్పులపైనే చర్చ జరుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహించారు. లక్షల కోట్ల రూపాయలు....

Janasena: తెలంగాణలో పోటీ చేసే సత్తా జనసేనకు ఉంది.. జనసేనాని పవన్ సెన్సేషనల్ కామెంట్స్
Pawan Kalyan
Follow us on

దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అప్పులపైనే చర్చ జరుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహించారు. లక్షల కోట్ల రూపాయలు దేశం దాటించగలరు కానీ జనాలకు మాత్రం మేలు చేయరని వ్యాఖ్యానించారు. వైసీపీకి 151 సీట్లు కట్టబెట్టినా సుపరిపాలన లేకుండా పోయిందని ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీని ఒప్పిస్తానని వెల్లడించారు. రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ(YCP) వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా అందరం ముందుకు వెళ్లాలని సూచించారు. నేను ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో వైసీపీ నాయకులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య వంటి అంశాలపై ఆయన స్పందించారు. తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేసే బలం తమకు ఉందని, 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ కు టీవీ9 ప్రశ్న:  మీ పార్టీలోనే జనసేన సింగిల్ గా పోటీ చేస్తే బాగుంటుంది కదా అనే చర్చ జరుగుతుంది. మీడియాలో చూస్తున్నాం మీరేమంటారు?

సమాధానం:  నేను పాలిటిక్స్ లో ఎప్పటి నుంచో ఉన్నాను. పొలిటికల్ గా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు సలహా ఇస్తే కచ్చితంగా వింటాను. అధికారంలోకి రావాలనే తపన లేదు. వెంపర్లాడడం లేదు. వచ్చే ఎన్నికల్లో నాకు ఏమీ రాలేదు అనుకున్నా నాకు సమస్య ఏమీ లేదు. వయస్సు పెరిగితే నిరుద్యోగులకు తేడా పెరుగుతుంది. పరిశ్రమలు రాకపోతే యువతకు ఇబ్బందులు ఎదురవుతాయి. నా జీవితానికి ఏ ఇబ్బంది రాదు. నేను ప్రశాంతంగానే ఉంటా. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా వ్యతిరేక ఓట్లు చీలకూడదని భావిస్తున్నా.

ఇవి కూడా చదవండి

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. ఈ నాలుగు పదాలు విని ఆ పార్టీ నాయకులు ఎందుకు అంత భయపడుతున్నారు. రాష్ట్రం బలమే జనసేనకు బలం. ఎక్కడ పోటీ చేసినా పవన్‌కల్యాణ్‌ను ఓడిస్తామంటున్న వైసీపీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉంది. పరిమితులు దాటి అప్పులు చేసిన అంశంపైనా కేంద్ర నాయకులతో మాట్లాడతా. బీసీలకు మేలు చేయడం అంటే వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం. వారు అభివృధ్ధి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం. కోడికత్తి కేసును ఎందుకు నిరూపించలేకపోయారు. ఈ విషయంలో వైసీపీ తీరుపై సందేహం ఉంది.

– పవన్ కల్యాణ్, జనసేన అధ్యక్షుడు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో శుక్రవారం పవన్ కల్యాణ్ పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన కార్యకర్త యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన కొంగరి సైదులు కుటుంబాన్ని లక్కారంలో పరామర్శించారు. సైదులు భార్య సుమతికి రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందని పవన్‌ వాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Hyderabad: మున్నా భాయ్‌ను మించిపోయాడు.. డాక్టర్ డ్రెస్ వేసి దర్జాగా ఆసుపత్రికి వెళ్లాడు.. సీన్ కట్ చేస్తే..

Heroin Seized: లక్షద్వీప్ తీరంలో అక్రమంగా తరలిస్తున్న 218 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం.. రూ. 1,500 కోట్లు విలువ ఉంటుందని అంచనా..