బిగ్ బ్రేకింగ్.. పవన్ కల్యాణ్‌కు సొంత ఎమ్మెల్యే డబుల్ షాక్

|

Dec 11, 2019 | 3:39 PM

జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, రాపాక మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఏకంగా జనసేనానికే క్లాస్ పీకారు. ఇక మరోవైపు మర్యాదగా ఉండదు అంటూ స్పీకర్‌పై చంద్రబాబు […]

బిగ్ బ్రేకింగ్.. పవన్ కల్యాణ్‌కు సొంత ఎమ్మెల్యే డబుల్ షాక్
Follow us on

జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీషు ప్రవేశపెట్టాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఒకవైపు జనసేన అధినేత పవన్, ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, రాపాక మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతేకాదు.. ఏకంగా జనసేనానికే క్లాస్ పీకారు.

ఇక మరోవైపు మర్యాదగా ఉండదు అంటూ స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సైతం జనసేన ఎమ్మెల్యే తప్పుబ్టటారు. పార్టీలు వేరైనా స్పీకర్ ఛైర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. రాపాక తాను పార్టీ మారను అంటూ ఫస్ట్ నుంచి క్లియర్‌గా చెబుతూనే ఉన్నారు.  మరోవైపు వైసీపీ పట్ల సానుకూల ధోరణిని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. గతంలో సీఎం జగన్‌ ఫోటోకు పాలాభిషేకం చేసిన రాపాక వార్తల్లో నిలిచారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు సపోర్ట్ తెలుపుతూ జనసేన‌కు పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపారు.

కాగా, రేపు పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన.. “రైతు సాభాగ్య దీక్ష”కు రాపాక వెళ్లడంలేదని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల కారణంగా.. దీక్షకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.