ఆగని వలసలు… త్వరలోనే జనసేన ఖాళీ అవబోతోందా?

| Edited By:

Oct 07, 2019 | 2:35 AM

జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే సీటు గెలవడం.. స్వయంగా పవన్ సైతం ఓడిపోవడంతో ఆ పార్టీపై నేతల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఇటీవలే రాజమండ్రికి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పగా.. తాజాగా   ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు జలక్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన […]

ఆగని వలసలు... త్వరలోనే జనసేన ఖాళీ అవబోతోందా?
Follow us on

జనసేనాని పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే సీటు గెలవడం.. స్వయంగా పవన్ సైతం ఓడిపోవడంతో ఆ పార్టీపై నేతల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఇటీవలే రాజమండ్రికి చెందిన సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పగా.. తాజాగా   ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు జలక్ ఇచ్చారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరుఫున పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీచేశారు చింతలపూడి వెంకట్రామయ్య.. అక్కడ ఓడిపోయారు. రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్న చింతలపూడి తాజాగా జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. గాజువాక ప్రజలు పార్టీ కార్యకర్తల కోరికమేరకే తాను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

చింతలపూడి జనసేనకు గుడ్ బై చెప్పడంతో ఇక గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. పవన్ పోయిన సారి గాజువాకలో పోటీచేయగా చింతలపూడి సహకరించారు. ఇప్పుడు గాజువాకలో జనసేనకు అండ  లేకుండా పోయింది. ఇప్పటికే జనసేనకు సీనియర్ నేతల రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దెపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణలకు గుడ్ బై చెప్పారు. తాజాగా చింతలపూడి కూడా ఆ పార్టీని వీడడం పవన్ కళ్యాణ్ కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.