తంటికొండ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేనాని

|

Oct 30, 2020 | 7:34 PM

తంటికొండ ప్రమాదంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యాక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారనే...

తంటికొండ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేనాని
Follow us on

Pawan on Thantikonda Accident : తంటికొండ ప్రమాదంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యాక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారనే వార్త తనను కలచివేసింది అని అన్నారు. తన ట్విట్టర్ వేదికగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఆనందంగా పెళ్లి వేడుకకు హాజరై వస్తున్నవారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరుతున్నాట్లుగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలి జసనేనాని కోరారు.

తంటికొండ ప్రమాదం దిగ్భ్రాంతికరం

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారనే వార్త కలచివేసింది. ఆనందంగా పెళ్లి వేడుకకు హాజరై వస్తున్నవారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరుతున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలి.

(పవన్ కల్యాణ్)
అధ్యక్షులు, జనసేన