అమిత్ షా ఉండగానే.. కిషన్ రెడ్డికి అరుదైన ఛాన్స్

| Edited By:

Jun 24, 2019 | 4:03 PM

17వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగిన సమావేశంలో పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సభ ముందుకు తీసుకొచ్చారు. ముందుగా ఈ బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో కిషన్ రెడ్డి ఈ బిల్లును తీసుకొచ్చారు. జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు, కశ్మీర్ నియంత్రణ రేఖకు 10 కిలో మీటర్ల దూరంలో […]

అమిత్ షా ఉండగానే.. కిషన్ రెడ్డికి అరుదైన ఛాన్స్
Follow us on

17వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగిన సమావేశంలో పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సభ ముందుకు తీసుకొచ్చారు. ముందుగా ఈ బిల్లును హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో కిషన్ రెడ్డి ఈ బిల్లును తీసుకొచ్చారు.

జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు, కశ్మీర్ నియంత్రణ రేఖకు 10 కిలో మీటర్ల దూరంలో నివాసం ఉండే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.