Panchayat Bypolls: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా..!

| Edited By: Pardhasaradhi Peri

Feb 13, 2020 | 5:58 PM

Panchayat Bypolls: జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 5వ తేదీ నుంచి 20 మధ్య 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు […]

Panchayat Bypolls: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా..!
Follow us on

Panchayat Bypolls: జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 5వ తేదీ నుంచి 20 మధ్య 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జమ్మూకశ్మీర్‌ ఎన్నికల అధికారి షైలేంద్ర కుమార్‌ తెలిపారు.

2018 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, జమ్మూ కాశ్మీర్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ప్రత్యేక హోదా క్రమంలో ఎన్నికల్లో పాల్గొనలేదు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షాలిందర్ కుమార్ తెలిపారు.కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ను ప్రకంటించిన తర్వాత జీసీ మర్మును అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో అక్కడ పాలనంతా కేంద్రం పర్యవేక్షణలో సాగుతోంది.