జమ్మూ కాశ్మీర్ లో హిమపాతం, రోడ్లపై దట్టంగా పరచుకున్న మంచు, స్థానికులకు నరకం

| Edited By: Pardhasaradhi Peri

Jan 10, 2021 | 7:06 PM

జమ్మూ కాశ్మీర్ లో హిమపాతం స్థానికులకు నరకం చూపుతోంది. రోడ్లపై దట్టంగా కొన్ని అడుగుల  మేర మంచు పేరుకుపోవడంతో..

జమ్మూ కాశ్మీర్ లో హిమపాతం, రోడ్లపై దట్టంగా పరచుకున్న మంచు, స్థానికులకు నరకం
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో హిమపాతం స్థానికులకు నరకం చూపుతోంది. రోడ్లపై దట్టంగా కొన్ని అడుగుల  మేర మంచు పేరుకుపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పైగా అస్వస్థులైన తమవారిని ఆసుపత్రులకు తరలించేందుకు లేదా మృతులను అంత్యక్రియలకు తీసుకువెళ్లేందుకు వీరు నానా ఇబ్బందులుపడుతున్నారు. మంచు పడడం నిలిచిపోయి మూడు రోజులు గడిచినా రోడ్లపై పరచుకున్న స్నో ని  తొలగించేందుకు ఒక్క మున్సిపల్ అధికారి గానీ కార్మికులుగానీ రాలేదని వీరు వాపోతున్నారు.వారం  రోజులుగా అంబులెన్సులు రోగులం ఇళ్లను చేరలేకపోతున్నాయి. పేషంట్లనో లేదా మృతులనో భుజాలపై మోస్తూ తీసుకువెళ్లేందుకు యువకులు మైళ్ళ దూరం నడవాల్సి వస్తోంది. జమ్మూ కాశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినా ఇప్పటికీ ఏలాంటి అభివృధ్ది లేదని స్థానికుల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Krunal Pandya: పాండ్యా ‘దాదాగిరి’.. సహచర ఆటగాడిపై అనుచిత వ్యాఖ్యలు.. బెదిరింపులకు దిగిన వైనం.!

దొంగిలించిన సొమ్ముతో పేదలకు సాయం, ఛారిటీలకు విరాళం, ఢిల్లీలో అభినవ ‘ రాబిన్ హుడ్ ‘అరెస్ట్

కోవిడ్ టీకా కోసం భారత్‌తో ఒప్పందం చేసుకున్న మయన్మార్.. 30 మిలియన్ వ్యాక్సిన్లు కావాలంటూ ఆర్డర్