కోవిడ్ టీకా కోసం భారత్‌తో ఒప్పందం చేసుకున్న మయన్మార్.. 30 మిలియన్ వ్యాక్సిన్లు కావాలంటూ ఆర్డర్

భారత దేశంలో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇందు కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా మన పొరుగునే ఉన్న మయన్మార్ కూడా..

  • Sanjay Kasula
  • Publish Date - 6:38 pm, Sun, 10 January 21
Myanmar has signed an MoU with India to purchase 30 million doses of COVID-19 vaccine

COVID-19 vaccine : భారత దేశంలో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇందు కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా మన పొరుగునే ఉన్న మయన్మార్ కూడా మనతో ఎంఓయూ కుదుర్చుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 30 మిలియన్ మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. ఈ మోతాదు ఫిబ్రవరి చివరి నాటికి పంపిణీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

బిల్‌గేట్స్‌ సహకారంతో నడిచే సంస్థలతోపాటు ఆస్ట్రాజెనెకాతో చేతులు కలిపిన మరో సంస్థ భారత్‌కు చెందిన ‘సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’కు మంచి డిమాండ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరిమాణంలో వ్యాక్సిన్‌ను తయారు చేసే కంపెనీగా ‘సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’కు పేరుంది. బిల్‌గేట్స్‌ మెలిండా గేట్స్‌ సహకారంతో నడిచే రెండు సంస్థలు మిగిలిన 750 మిలియన్‌ డాలర్లు విలువైన ఒప్పందాన్ని దక్కించుకున్నాయి.

భార‌త్ కు చెందిన కంపెనీల‌తో వ్యాక్సిన్ కోసం ఇప్ప‌టికే బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకుంది.ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ కోసం భార‌త్ నుంచి ఆ దేశం ఎదురుచూపులు చూస్తోంది.

ఇవి కూడా చదవండి :

చికెన్ తింటే బర్డ్ ప్లూ వ్యాధి సోకుతుందనే వదంతులు.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ రైతుల్లో కొత్త ఆందోళన

Bitcoin Price : రాకెట్‌లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..