జల్లేరు వాగులో కొట్టుకుపోతోన్న జనం

|

Oct 08, 2020 | 3:01 PM

పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరు వాగు ప్రమాదకారిగా మారింది. నిన్న కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా వాగు పొంగి పొర్లుతోంది. ఆ సమయాంలో ద్విచక్రవాహనాంపై వాగు దాటుతోన్న అటవీశాఖ ఉద్యోగి రామయ్య ప్రమాదవశాత్తూ వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. అది గమనించిన స్థానికులు అతని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరో స్థానికుడు కూడా వాగులో కొట్టుకుపోతుండటం చూసిన స్థానికులు అతన్ని కూడా రక్షించి ప్రాణాలు కాపాడారు. వాగు ఉధృతి పెరిగినప్పుడల్లా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయంటూ […]

జల్లేరు వాగులో కొట్టుకుపోతోన్న జనం
Follow us on

పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరు వాగు ప్రమాదకారిగా మారింది. నిన్న కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా వాగు పొంగి పొర్లుతోంది. ఆ సమయాంలో ద్విచక్రవాహనాంపై వాగు దాటుతోన్న అటవీశాఖ ఉద్యోగి రామయ్య ప్రమాదవశాత్తూ వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. అది గమనించిన స్థానికులు అతని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరో స్థానికుడు కూడా వాగులో కొట్టుకుపోతుండటం చూసిన స్థానికులు అతన్ని కూడా రక్షించి ప్రాణాలు కాపాడారు. వాగు ఉధృతి పెరిగినప్పుడల్లా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వెంటనే వాగుపై బ్రిడ్జి నిర్మించి ప్రజల్ని ప్రమాదాల బారినుంచి కాపాడాలని జనం డిమాండ్ చేస్తున్నారు.