ముంచెత్తుతున్న వరదలు.. నీటిలో చిక్కుకున్న అధ్యక్ష భవనం..

| Edited By:

Feb 26, 2020 | 5:09 AM

ఇండోనేషియా రాజధాని జకార్తాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు.. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజధాని ప్రాంతమంతా.. వరద నీటితో మునిగిపోయింది.కొన్ని ఉప నదులు పొంగిపొర్లడంతో పాటు మరికొన్ని కట్టలు తెగిపోయాయి. దేశాధ్యక్ష భవనంతో పాటు.. వేల ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ మొత్తం వరద ప్రభావంతో.. స్తంభించిపోయిందని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. భవనాలు, వ్యాపార కేంద్రాల్లో దాదాపు అయిదు అడుగుల మేర.. బురద నిండిపోయిందరి.. విపత్తు నిర్వహణాధికారులు […]

ముంచెత్తుతున్న వరదలు.. నీటిలో చిక్కుకున్న అధ్యక్ష భవనం..
Follow us on

ఇండోనేషియా రాజధాని జకార్తాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు.. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజధాని ప్రాంతమంతా.. వరద నీటితో మునిగిపోయింది.కొన్ని ఉప నదులు పొంగిపొర్లడంతో పాటు మరికొన్ని కట్టలు తెగిపోయాయి. దేశాధ్యక్ష భవనంతో పాటు.. వేల ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ మొత్తం వరద ప్రభావంతో.. స్తంభించిపోయిందని విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. భవనాలు, వ్యాపార కేంద్రాల్లో దాదాపు అయిదు అడుగుల మేర.. బురద నిండిపోయిందరి.. విపత్తు నిర్వహణాధికారులు తెలిపారు.

కాగా అధ్యక్ష భవనంలోకి చేరిన వరద నీటిని.. పంపుల సాయంతో తోడేస్తున్నారు. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో.. ఇళ్లపై ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇదిలా ఉంటే.. మరో రెండు వారాల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.