‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత జాబితా సిద్ధం.. జనవరి 9న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ..

|

Dec 21, 2020 | 9:08 PM

Jagananna Ammavodi Scheme: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న అమ్మఒడి' పధకం రెండో విడత లబ్ధిదారుల జాబితాను...

జగనన్న అమ్మఒడి రెండో విడత జాబితా సిద్ధం.. జనవరి 9న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ..
Follow us on

Jagananna Ammavodi Scheme: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న అమ్మఒడి’ పధకం రెండో విడత లబ్ధిదారుల జాబితాను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ జాబితాలో పేర్లు నమోదు కాని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే.. దగ్గరలోని గ్రామ సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. అలాంటి వారిని జాబితాలో చేర్చి ఫైనల్ లిస్టును డిసెంబర్ 26వ తేదీన ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. (Jagananna Amma Vodi Status)

అర్హులైన ప్రతీ ఒక్కరికి అమ్మ ఒడిని అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జనవరి 9న ‘అమ్మఒడి’ లాంఛనంగా ప్రారంభిస్తారని.. అదే రోజున లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారని అన్నారు. ఇంత పకడ్బందీగా జగనన్న అమ్మ ఒడి పధకాన్ని అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. చాలా మందికి అమ్మ ఒడి పధకం అందడం లేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అర్హత ఉండి, పొరపాటున లబ్దిదారుల జాబితాలో పేరులేకపోతే వెంటనే సచివాలయాల్లో సంప్రదిస్తే వారికి కూడా అమ్మ ఒడి పధకం అందించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు. (Jagananna Amma Vodi Beneficiary List)