రేపే మోదీతో జగన్ భేటీ.. మేటర్ ఇదే

|

Oct 05, 2020 | 6:39 PM

ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని...

రేపే మోదీతో జగన్ భేటీ.. మేటర్ ఇదే
Follow us on

Jagan to meet Narendramodi tomorrow: ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముఖ్యమంత్రి న్యూఢిల్లీ నుంచే వర్చువల్ విధానంలో హాజరవుతారని ఏపీ సీఎంఓ వర్గాలు తెలిపాయి.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిణామాలు, ఆర్థిక పరిస్థితి, తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలు, రాజధాని అంశంపై నెల కొన్ని రాజకీయ వివాదం వంటి అంశాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ బకాయిలను విడుదల చేయడంతోపాటు.. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు తోడ్పాటునందించాలని ప్రధానిని కోరతారని సమాచారం. మంగళవారం ఉదయం పదిన్నరకు ప్రధానితో ఏపీ ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంటు ఖరారైందని తెలుస్తోంది.

మరోవైపు అక్టోబర్ 6వ తేదీ మంగళవారం జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ సారథ్యంలో నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈ కౌన్సిల్ భేటీ వర్చువల్ విధానంలో జరుగనున్నది. ఈ సమావేశానికి జగన్ న్యూఢిల్లీ నుంచి హాజరు కానున్నారు.

Also read: ఢిల్లీ కేపిటల్స్‌కు పెద్ద షాక్.. గాయంతో కీలక బౌలర్ ఔట్

Also read: సముద్రంలో చైనాకు చెక్.. ‘స్మార్ట్‘ ప్రయోగం సక్సెస్

Also read: కోవాక్సిన్‌లో అదనపు ఔషధం..అదే కీలకం!

Also read: కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్