మీ అత్తగారికి కూడా పదవిచ్చాం..చంద్రబాబుతో జగన్

|

Dec 11, 2019 | 11:56 AM

ఏపీ అసెంబ్లీ రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. సంయమనం కొల్పోయిన చంద్రబాబు స్పీకర్‌ను మార్యాదగా ఉండదంటూ కామెంట్ చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. పలువురు వైసీపీ సభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించండంతో పాటు ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. స్పీకర్… చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పి సభను కొనసాగించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల అలాట్‌మెంట్ గురించి మాట్లాడిన జగన్, పలు ఆసక్తికర వ్యాఖ్యలు […]

మీ అత్తగారికి కూడా పదవిచ్చాం..చంద్రబాబుతో జగన్
Follow us on

ఏపీ అసెంబ్లీ రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. సంయమనం కొల్పోయిన చంద్రబాబు స్పీకర్‌ను మార్యాదగా ఉండదంటూ కామెంట్ చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. పలువురు వైసీపీ సభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించండంతో పాటు ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. స్పీకర్… చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని చెప్పి సభను కొనసాగించారు.

ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల అలాట్‌మెంట్ గురించి మాట్లాడిన జగన్, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవులు ఇచ్చినవారి పేర్లు ఒక్కొక్కటి చదువుతూ ఉండగా మధ్యలో లక్ష్మీ పార్వతీ పేరు వచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించామని చెప్పిన జగన్,   ఆమె.. ఆయన అత్తగారే  అంటూ చంద్రబాబుకు సెటైర్ వేశారు. ఈ సమయంలో వైసీపీ సభ్యలు బల్లలు చరిచారు.