#India locked down లాక్‌డౌన్ మరింత కఠినతరం.. జగన్ డెసిషన్

|

Mar 28, 2020 | 2:40 PM

ఏపీలో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడ కుండా వుండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని నిర్దేశించారు.

#India locked down లాక్‌డౌన్ మరింత కఠినతరం.. జగన్ డెసిషన్
Follow us on

Jagan latest decision on lock down: ఏపీలో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడ కుండా వుండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని నిర్దేశించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ శనివారం సమీక్ష జరిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్నా నిర్ణయాలు, అమలు అంశాలను సీఎంకు వివరించారు సీఎస్‌ నీలం సాహ్ని.

ప్రస్తుతం ఉన్న ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటలవరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై అధికారులు ప్రస్తావించగా.. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘శాస్త్రీయంగా పరిశీలించండి.. మ్యాపింగ్‌ చేయండి.. పరిశీలించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలను తీసుకోండి.. ప్రజలకు సరిపడా రైతుజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయాన్ని తగ్గించే ఆలోచనలు చేయండి.. ’’ అని ముఖ్యమంత్రి అధికారయంత్రాంగానికి సూచించారు.

ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే వసతులను ఏర్పాటు చేయాలని, 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడే వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని సీఎం చెప్పారు. వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసే క్యాంపుల్లో కచ్చితంగా ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, అలాగే రాష్ట్రం వెలుపల రాష్ట్రానికి చెందిన కూలీలు, కార్మికుల స్థితిగతులను తెలుసుకుని ఎప్పటికప్పుడు స్పందించడానికి రాష్ట్రస్థాయిలో ఒక ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

రాష్ట్ర సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నకళ్యాణ మండపాలు, హోటళ్ళను వాటిని గుర్తించి, వాటిని శానిటైజ్‌ చేసి, అందుబాటులోకి తీసుకురావాలని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు క్వారెంటైన్ ‌కు అంగీకరిస్తే వారిని ఫంక్షన్ హాళ్ళలోను, హోటళ్ళలోను వుంచాలని సీఎం నిర్దేశించారు.