ఆ గ్రామాలపై సీఎం జగన్ ఆరా.. విషయం తెలిసి వార్నింగ్

|

May 11, 2020 | 4:41 PM

రాష్ట్రంలోని ఆ అయిదు గ్రామాల్లో పరస్థితి ఏంటి అనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆ గ్రామాల్లో పరిస్థితులు పూర్తి చక్కబడ్డాయా అని వాకబు చేశారు.

ఆ గ్రామాలపై సీఎం జగన్ ఆరా.. విషయం తెలిసి వార్నింగ్
Follow us on

రాష్ట్రంలోని ఆ అయిదు గ్రామాల్లో పరస్థితి ఏంటి అనే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆ గ్రామాల్లో పరిస్థితులు పూర్తి చక్కబడ్డాయా అని వాకబు చేశారు. పరిస్థితులు పూర్తిగా చక్కబడే దాకా ఆ అయిదు గ్రామాల్లోనే జిల్లాకు చెందిన మంత్రులు రాత్రిళ్ళు బస చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెండు రోజుల్లోగా బాధితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని అందచేయాలని మంత్రులను జగన్ నిర్దేశించారు.

విశాఖ నగర శివారుల్లోని అయిదు గ్రామాలపై స్టైరిన్ పంజా విసిరిన నేపథ్యంలో ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలంతా గందరగోళానికి గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువు వెదజల్లి మూడు రోజులు అయిపోతున్నా ఇంకా ప్రజల్లో ఆందోళన కొనసాగుతూనే వుంది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్… సోమవారం విశాఖ నగర పరిస్థితిపై ఆరా తీశారు. ఎల్జీ పాలిమర్స్ సమీపంలోని 5 గ్రామాల్లో పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయా అని వాకబు చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు.

5 గ్రామాల్లో మంత్రులు, అధికారులు రాత్రి బస చేయాలని, రెండు రోజుల్లో బాధితుల వివరాలు సేకరించి మహిళల పేరున నగదు జమ చేయాలని ఆదేశించారు. 5 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఒక సీహెచ్‌సీ, ఆంబులెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎల్.జి. పాలిమర్స్ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. 5 గ్రామాలను పూర్తి స్థాయిలో శానిటైజేషన్ ను సాయంత్రం 4 గంటలకే పూర్తి చేసి గ్రామ ప్రజలను తమ తమ ఇళ్లకు పంపాలన్నారు. 5 గ్రామాల్లో రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ రోజు రాత్రి బస చేయాలని చెప్పారు. 5 గ్రామాల్లో సేఫ్ కండీషన్ నెలకొన్నట్లేనా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 5 గ్రామాల్లో రోడ్లు, కాలువలను పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నట్లు మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు.