గిరిజనానికి జగనన్న కరుణ

|

Sep 29, 2020 | 12:12 PM

గిరిజనాన్ని జగన్ సర్కారు కరుణించింది. ఆంధ్రప్రదేశ్ లోని ఐటిడిఎ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు నడుంబిగించింది. వీటికోసం ఇవాళ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తంగా 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ 246.3 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఒక్కో ఆసుపత్రికి 49.26 కోట్ల రూపాయలు కేటాయించింది. సీతంపేట (శ్రీకాకుళం), పార్వతిపురం (విజయనగరం), రామచంద్రపురం (తూ.గో), బుట్టాయిగూడెం (ప.గో), దోర్నాల (కర్నూల్) లో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. […]

గిరిజనానికి జగనన్న కరుణ
visakhapatnam agency pregnant woman walks 20 km for medical treatment both mom and baby dies
Follow us on

గిరిజనాన్ని జగన్ సర్కారు కరుణించింది. ఆంధ్రప్రదేశ్ లోని ఐటిడిఎ ప్రాంతాల్లో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు నడుంబిగించింది. వీటికోసం ఇవాళ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తంగా 5 ఏజెన్సీ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ 246.3 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఒక్కో ఆసుపత్రికి 49.26 కోట్ల రూపాయలు కేటాయించింది.

సీతంపేట (శ్రీకాకుళం), పార్వతిపురం (విజయనగరం), రామచంద్రపురం (తూ.గో), బుట్టాయిగూడెం (ప.గో), దోర్నాల (కర్నూల్) లో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జగన్ సర్కారు తాజా నిర్ణయంతో అసలే సరైన రోడ్లు, రవాణా సదుపాయాల్లేక.. ఆరోగ్యం క్షీణిస్తే గిరిపుత్రులు.. నిండు గర్భిణిలు పడుతున్న బ్రతుకు వ్యథలు కొంతైనా తీరే అవకాశం ఉంది.