అజ్ఞాతంలో కల్కీ దంపతులు.. మిస్టరీగా ఆశ్రమం..!

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 4:03 PM

కల్కీ ఆశ్రమంలో ఏం జరుగుతోంది.? కల్కీ ఆస్తులు కోట్లకు ఎలా చేరాయి..? కల్కీ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమం మాదిరిగా ఒక మిస్టరీనా..? ఐటీ దాడుల తర్వాత బయటికొస్తున్న ఒక్కో వాస్తవం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. భక్తి ముసుగులో కల్కీ ఓ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తోంది. మహావిష్ణువుకి పదవ అవతారాన్ని అని ప్రచారం చేస్తూ.. లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టాడని బయటపడుతోంది. తాజా లెక్కల ప్రకారం కల్కీ ఆస్తులు దాదాపు 3 లక్షల […]

అజ్ఞాతంలో కల్కీ దంపతులు.. మిస్టరీగా ఆశ్రమం..!
Follow us on

కల్కీ ఆశ్రమంలో ఏం జరుగుతోంది.? కల్కీ ఆస్తులు కోట్లకు ఎలా చేరాయి..? కల్కీ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమం మాదిరిగా ఒక మిస్టరీనా..? ఐటీ దాడుల తర్వాత బయటికొస్తున్న ఒక్కో వాస్తవం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. భక్తి ముసుగులో కల్కీ ఓ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు తెలుస్తోంది. మహావిష్ణువుకి పదవ అవతారాన్ని అని ప్రచారం చేస్తూ.. లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టాడని బయటపడుతోంది. తాజా లెక్కల ప్రకారం కల్కీ ఆస్తులు దాదాపు 3 లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నిత్యం వివాదాలకు కేంద్రంగా కనిపిస్తున్న కల్కీ ఆశ్రమం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

మూడో రోజు కూడా కల్కీ ఆశ్రమంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు హైదరాబాద్‌లోనూ కల్కీ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. కల్కీ ఆశ్రమంలో బంగారు బిస్కట్లు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కల్కీ కుమారుడు కృష్ణాజీ, కోడలు ప్రీతీజీని అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చెన్నైలోని నుంగ బాకంలో ఉన్న ప్రధాన కార్యాలయంలో వీరిని ప్రశ్నిస్తున్నారు. వీరి దగ్గర రూ.40 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కల్కీ దంపతులు అజ్ఞాతంలోకి వెళిపోవడతో.. వరదైపాళెంలో ఉన్న కల్కీ ఆశ్రమం పూర్తిగా పోలీస్ పహారాలో ఉంది. ఇదంతా చూస్తుంటే స్థానికుల్లో అసలు ఆశ్రమంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. దాదాపు 25 ఏళ్లలో అనేక సార్లు ఆశ్రమం పేరునూ ఎందుకు మార్చుతూ వచ్చారు. దీనికి ప్రధాన కారణమేంటి..? భక్తి పేరుతో వచ్చిన నిధులను ఏ రకంగా దారి మళ్లించారు..? అన్న దానిపై ఐటీ ఆధికారులు ఆరా తీస్తున్నారు.

ఆశ్రమ కార్య నిర్వాహకులు ఆధ్యాత్మికపరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాలు ఏం చేశారన్న కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రస్టుకు సంబంధించిన ఆదాయ వ్యయాలతో పాటు.. భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.