‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘సైరా’కు హెల్ప్‌ అయ్యిందా..?

| Edited By:

Oct 13, 2019 | 6:14 PM

‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డి’కి హెల్ప్ అయ్యిందా అంటే.. అవుననే అనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా రిలీజైన సైరా సినిమా.. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తరువాత కూడా.. వీకెండ్స్‌‌లో దూసుకుపోతూ వచ్చింది. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితి కొత్త పుంతలు తొక్కినట్టైంది. విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సెలవులు పొడిగిస్తూండటంతో.. బస్సులు లేకపోయినప్పటికీ.. రికార్డుల మోత మోగిస్తున్న సైరా చిత్రంవైపు […]

ఆర్టీసీ స్ట్రైక్ పరోక్షంగా సైరాకు హెల్ప్‌ అయ్యిందా..?
Follow us on

‘ఆర్టీసీ స్ట్రైక్’ పరోక్షంగా ‘మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా నరసింహా రెడ్డి’కి హెల్ప్ అయ్యిందా అంటే.. అవుననే అనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా రిలీజైన సైరా సినిమా.. రిలీజైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తరువాత కూడా.. వీకెండ్స్‌‌లో దూసుకుపోతూ వచ్చింది. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితి కొత్త పుంతలు తొక్కినట్టైంది. విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సెలవులు పొడిగిస్తూండటంతో.. బస్సులు లేకపోయినప్పటికీ.. రికార్డుల మోత మోగిస్తున్న సైరా చిత్రంవైపు యూత్ ఎట్రాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కాలేజీ స్టూడెంట్స్‌ 12 రోజుల దసరా సెలవులు ఎంజాయ్ చేయగా.. ఆర్టీసీ సమ్మె పుణ్యమా అని.. ఇప్పుడు మరో వారం రోజుల పాటు అంటే ఈ నెల 20వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. దీంతో.. యువత.. ఇన్‌డైరెక్ట్‌గానే ఎంటర్‌టైన్‌మెంట్‌నే తమ కాలక్షేపంగా భావించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కాగా.. ప్రస్తుతం సైరా సినిమా తప్ప మరే భారీ బడ్జెట్ మూవీలు లేకపోవడంతోపాటు ఈ సినిమా పట్ల జనాలకు క్రేజ్ తగ్గడం లేదు. దీంతో.. పిల్లలు.. పెద్దలు కూడా చిరంజీవి సినిమాకి క్యూ కడుతున్నారు. సినిమా విడుదలై దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ.. సినిమా కలెక్షన్లు.. ఏమాత్రం తగ్గడంలేదు.

ఈ సినిమా మొదటి రోజునే 50 కోట్ల క్లబ్‌లో చేరి.. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. కాగా.. నిజాం హక్కులు 34 కోట్లకు అమ్ముడు పోగా.. 29 కోట్ల వాటాను కూడా వసూలు చేసి.. తనకు తిరుగు లేదని ఈ చిత్రం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో.. యువత సైరా జపాన్ని స్మరిస్తున్నారంటే.. అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా.. కొణిదెల ప్రొడక్షన్స్‌కి.. నిర్మాత రామ్ చరణ్‌కి బడ్జెట్‌ని మించిన ప్రాఫిట్ రేంజ్ వచ్చేసినట్టే.