లోకేష్ గెలుపుకు పవన్ పరోక్షంగా సహాయపడుతున్నాడా..?

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:14 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాశాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సైతం రెండో జాబితాను ప్రకటించేసింది. ఇది ఇలా ఉంటే సీపీఐ తో పొత్తు భాగంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించింది. దీనితో పాటుగా 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుపొందిన స్థానాలకు టీడీపీ కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. […]

లోకేష్ గెలుపుకు పవన్ పరోక్షంగా సహాయపడుతున్నాడా..?
Follow us on

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాశాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సైతం రెండో జాబితాను ప్రకటించేసింది. ఇది ఇలా ఉంటే సీపీఐ తో పొత్తు భాగంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించింది. దీనితో పాటుగా 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలుపొందిన స్థానాలకు టీడీపీ కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు ఆ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించేవరకు.. ఆగాలని భావిస్తున్నాడట. ఇక ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీతో పొత్తును ఖండిస్తూ, ఆ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంటున్న పవన్, లోకేష్ లాంటి అభ్యర్థి పై గట్టి పోటీ ఇవ్వకపోవడం తో పరోక్షంగా టీడీపీకి సాయం చేస్తున్నాడని భావన కలుగుతోంది రాజకీయ విశ్లేషకులలో.

అసలే టీడీపీ, సిపిఐలకు గతంలో పొత్తు పెట్టుకున్న అనుభవం ఉంది, 2014లో టీడీపీ, బీజేపీతో కలిసిందన్న ఒక్క కారణంతో టీడీపీతో పొత్తుకు నిరాకరించింది కానీ, దాదాపు గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది సిపిఐ. అలాంటిది టీడీపీ ముఖ్య అభ్యర్థిపై జనసేన పోటీకి దిగకుండా సిపిఐకి స్థానమివ్వటం పరోక్షంగా టీడీపీ గెలుపుకు జనసేన దోహద పడినట్టే అయ్యిందని వినికిడి. ఈ మధ్య కాలంలో గమనిస్తే టీడీపీ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి కూడా కాస్త మారినట్టే కనిపిస్తోంది సమాచారం. ఇప్పుడు సీట్ల పంపకం విషయంలో ఆ అభిప్రాయం మరింత బలపడుతోంది. మరి ఇంకా మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.