రోహిత్‌.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?

|

Nov 04, 2020 | 4:46 PM

రోహిత్‌కు ఇదేం చివరి సిరీస్, లీగ్ కాదని.. ఐపీఎల్‌లో ఆడటంతోపై రోహిత్ శర్మ పునరాలోచించుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు.

రోహిత్‌.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?
Follow us on

Dilip Vengsarkar Comments: టీమిండియా ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు. హైదరాబాద్‌తో జరిగిన ముంబై చివరి మ్యాచ్‌లో అతడు ఆడటమే ఇందుకు కారణం. తొడకండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేయలేదు. ఇక సౌరవ్ గంగూలీ కూడా రోహిత్ గాయంపై స్పందిస్తూ.. సుదీర్ఘమైన కెరీర్ ఉన్న రోహిత్‌కు ఇదేం చివరి సిరీస్, లీగ్ కాదని.. ఐపీఎల్‌లో ఆడటంపై రోహిత్ శర్మ పునరాలోచించుకోవాలని సూచించాడు. అంతేకాదు సరైన నిర్ణయాలు తీసుకునే పరిణితి అతడికి ఉన్నట్లు భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశాడు. మరి ఇవేం పట్టనట్లు రోహిత్ శర్మ ముంబై చివరి లీగ్ మ్యాచ్‌కు బరిలోకి దిగాడు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది. అసలు గాయం విషయంలో రోహిత్ శర్మది తప్పా.? లేక బీసీసీఐ అసలు విషయం దాస్తోందా.? అనేది అటు అభిమానులకు, ఇటు మాజీలకు క్లారిటీ రావట్లేదు.

ఈ నేపధ్యంలో రోహిత్‌పై మాజీ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ ప్రశ్నల వర్షం కురిపించాడు. టీమిండియా తరపున ఆడటం కంటే రోహిత్‌కు ఐపీఎల్ అంత ముఖ్యమా.? అని నిలదీశాడు. రోహిత్‌పై బీసీసీఐ చర్యలు తీసుకోగలదా.? అసలు రోహిత్ గాయంపై బోర్డు ఫిజియో(నితిన్ పటేల్) సరిగ్గా అంచనా వేయలేకపోయాడా.? అని వెంగ్‌సర్కార్ అడుగుతున్నాడు. అసలు ఇప్పుడు ప్రశ్నేంటంటే.. టీమిండియా కంటే ఐపీఎల్ అతనికి ముఖ్యమా? జాతీయ జట్టు కోసం ఆడటం కంటే క్లబ్ ముఖ్యమా? మరి అలాంటప్పుడు బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకోగలదా? లేదా బోర్డు ఫిజియో రోహిత్ గాయాన్ని సరిగ్గా విశ్లేషించలేకపోయాడా”అని అడిగాడు. అసలు ఎందులో నిజం ఉందో స్పష్టత ఇవ్వాలని బోర్డును కోరాడు.