అక్వేరియంతో మానసిక ప్రశాంతత..

| Edited By:

Apr 26, 2019 | 12:46 PM

చాలా మంది ఇళ్లల్లో అక్వేరియాలను చూస్తూంటాం.. కొంత మంది ఇంట్లో డెకరేషన్ కోసం, మరికొంతమంది శుభం జరుగుతుందని పెట్టుకుంటారు. కాగా.. అక్వేరియం ఇంట్లో ఉండడం వల్ల మనకు మానసిక ప్రశాంతత కలుగుతుందని సైన్స్ చెబుతోంది. అక్వేరియాల్లో చేపలు కదిలే తీరును గమనిస్తూంటే ఏకాగ్రత పెరుగుతుందని మానసిక నిపుణులు తెలిపారు. అంతేకాకుండా.. మనలో ఒత్తిడి, కోపం తగ్గుతుందని, స్థిర నిర్ణయాలు తీసుకోగల్గుతామని వారంటున్నారు. అయితే.. చేపలు తిరిగేందుకు చిన్న అక్వేరియాలు కాకుండా వీలైనంత విశాలంగా ఉండే పెద్ద అక్వేరియాలు […]

అక్వేరియంతో మానసిక ప్రశాంతత..
Follow us on

చాలా మంది ఇళ్లల్లో అక్వేరియాలను చూస్తూంటాం.. కొంత మంది ఇంట్లో డెకరేషన్ కోసం, మరికొంతమంది శుభం జరుగుతుందని పెట్టుకుంటారు. కాగా.. అక్వేరియం ఇంట్లో ఉండడం వల్ల మనకు మానసిక ప్రశాంతత కలుగుతుందని సైన్స్ చెబుతోంది. అక్వేరియాల్లో చేపలు కదిలే తీరును గమనిస్తూంటే ఏకాగ్రత పెరుగుతుందని మానసిక నిపుణులు తెలిపారు. అంతేకాకుండా.. మనలో ఒత్తిడి, కోపం తగ్గుతుందని, స్థిర నిర్ణయాలు తీసుకోగల్గుతామని వారంటున్నారు. అయితే.. చేపలు తిరిగేందుకు చిన్న అక్వేరియాలు కాకుండా వీలైనంత విశాలంగా ఉండే పెద్ద అక్వేరియాలు తీసుకోవడం మంచిది. అలాగే.. క్రమం తప్పకుండా నీటిని శుభ్రం చేసుకుంటూ వాటికి ఆహారాన్ని అందించడం వల్ల కూడా ఇంట్లో మంచి జరుగుతుందని తాజా అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు