ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్.. వర్సిటీలతోపాటు కేంద్రానికి నోటీసులు

|

Dec 24, 2020 | 1:57 PM

తెలంగాణలోని రెండు ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్పుల మంజూరులో అక్రమాలు జరిగాయన్న విషయం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ...

ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్.. వర్సిటీలతోపాటు కేంద్రానికి నోటీసులు
Follow us on

Irregularities in Fellowships allotment: తెలంగాణలోని రెండు ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్పుల మంజూరులో అక్రమాలు జరిగాయన్న విషయం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఫెలోషిప్పుల మంజూరులో అక్రమాలు జరిగాయంటూ గురువారం తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

రెండు యూనివర్సిటీలలో కేటాయించిన ఫెలో షిప్పులపై సీబీఐచే విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని పీహెచ్‌డీ  అభ్యర్థి కె. శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్పులు మంజూరయ్యాయని పిటిషనర్ ఆరోపించారు. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రెండు యూనివర్సిటీలతోపాటు యూజీసీ, సీబీఐలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్