Standard Policies: అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు.. బీమా సంస్థలను ఆదేశించిన ఐఆర్‌డీఏఐ

|

Jan 08, 2021 | 5:23 AM

Standard Policies: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా వచ్చే నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను..

Standard Policies: అగ్ని ప్రమాదాలకు మూడు ప్రామాణిక పాలసీలు.. బీమా సంస్థలను ఆదేశించిన ఐఆర్‌డీఏఐ
Follow us on

Standard Policies: అగ్ని ప్రమాదాలు, వాటి కారణంగా వచ్చే నష్టాన్ని భర్తీ చేసే ప్రామాణిక బీమా పాలసీలను కనీసం మూడింటిని ప్రవేశపెట్టాలని అన్ని సాధారణ బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న స్టాండర్డ్‌ అండ్‌ స్సెషల్‌ పెరిల్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎస్‌పీ) స్థానంలో భారత్‌ గృహ రక్ష, భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష, భారత్‌ లఘు ఉద్యమ్‌ సురక్ష పాలసీలను ప్రవేశపెట్టాలని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) తన ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఏప్రిల్‌ 1 నుంచి సాధారణ బీమా సంస్థలు వీటిని తప్పకుండా ఆఫర్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే ఈ పాలసీ ఇల్లు, ఇంట్లోని వస్తువుల కవరేజీకి ఉద్దేశించినది. ఇంటితో పాటు ఇంట్లో వస్తువులకూ ఆటోమేటిక్‌గా బీమాలో 20 శాతం కవరేజ్‌ లభిస్తుంది. దాదాపుగా విలువైన వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని ప్రపోజల్‌ పత్రంలో పేర్కొనడం ద్వారా మరింత కవరేజ్‌ని పొందే అవకాశం ఉంటుంది. భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష అన్నది సంస్థల కోసం ప్రత్యేకించినది. రూ.5 కోట్ల వరకు రిస్క్‌ కవర్‌ను ఇందులో భాగంగా ఆఫర్‌ చేయాల్సి ఉంటుంది.

Varavara Rao Hospital: విరసం నేత వరవరరావు జనవరి 13 వరకూ ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు: ముంబై కోర్టు