ఇరాన్‌ సుప్రీం నేత.. హిందీలో ట్విట్టర్ ఖాతా

| Edited By:

Aug 10, 2020 | 5:33 AM

ఇరాన్‌ అగ్రనేత ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ ఎట్టకేలకు సోషల్ మీడియాలో రంగప్రవేశం చేశారు. తాజాగా ఆయన సామాజిక మాధ్యమమైన ట్విట్టర్‌ ఖాతాను స్టార్ట్ చేశారు. అయితే అంతా ఒక భాషలోనే..

ఇరాన్‌ సుప్రీం నేత.. హిందీలో ట్విట్టర్ ఖాతా
Follow us on

ఇరాన్‌ అగ్రనేత ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ ఎట్టకేలకు సోషల్ మీడియాలో రంగప్రవేశం చేశారు. తాజాగా ఆయన సామాజిక మాధ్యమమైన ట్విట్టర్‌ ఖాతాను స్టార్ట్ చేశారు. అయితే అంతా ఒక భాషలోనే అకౌంట్లు ఓపెన్‌ చేస్తే.. ఆయతుల్లా లేటుగా ఎంటర్‌ అయినా.. లేటెస్ట్‌గా అకౌంట్స్‌ ఓపెన్ చేశారు. ఆయన ఒకే భాషలో కాకుండా పలు భాషల్లో అకౌంట్లను తెరిచారు. అందులో హిందీలో కూడా ఓ అకౌంట్‌ను ఓపెన్‌ చేశారు. అంతేకాదు.. పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, స్పానిష్, రష్యన్, ఇంగ్లీష్ భాషల్లో కూడా సెపరేట్ ట్విట్టర్‌ అకౌంట్స్‌ను ఓపెన్‌ చేశారు.

కాగా, ప్రస్తుతం ఆయతుల్లా వయస్సు 81 ఏళ్లు. 1989 నుంచి ఇరాన్ సుప్రీం నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 1981 నుంచి 1989 వరకు ఇరాన్ ప్రెసిడెంట్‌గా పదవిని చేపట్టారు. ఇక ఆయతుల్లా ఇరాన్‌కు రెండో సుప్రీం నేతగా ఉన్నారు. ఇరాన్‌లో సుప్రీం నేతదే పూర్తి పెత్తనం ఉంటుంది. సుప్రీం నేతను.. అధ్యక్షుడు సహా పార్లమెంట్ సభ్యులంతా కలిసి ఎన్నుకుంటారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు