Iranian Football Fans: జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న ఆటగాళ్లను చూసి కన్నీళ్లు పెట్టిన అభిమానులు.. కారణం ఏమిటంటే..?

|

Nov 26, 2022 | 9:37 AM

వేల్స్‌తో ఇరాన్ తలపడే ముందుగా ఓ ఘటన జరిగింది. ఈ ఫిఫా టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్ళు తమ జాతీయ గీతాన్ని  పాడటానికి నిరాకరించగా..

Iranian Football Fans: జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న ఆటగాళ్లను చూసి కన్నీళ్లు పెట్టిన అభిమానులు.. కారణం ఏమిటంటే..?
Iranian Fans Crying
Follow us on

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం వేల్స్, ఇరాన్ ఫుట్‌బాల్ జట్లు తలపడ్డాయి. ఈ ఆటలో వేల్స్‌పై ఇరాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి, టోర్నమెంట్‌లో మొదటి విజయాన్ని సాధించింది. అయితే, వేల్స్‌తో ఇరాన్ తలపడే ముందుగా ఓ ఘటన జరిగింది. ఈ ఫిఫా టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్ళు తమ జాతీయ గీతాన్ని  పాడటానికి నిరాకరించగా.. శుక్రవారం వారు అలపించారు.

తమ దేశంలోని నిరసనకారులకు మద్దతునిస్తూ.. ఇరాన్ ఆటగాళ్ళు ఈ వారం ఇంగ్లండ్‌తో జరిగిన ఆటకు ముందు తమ జాతీయ గీతం పాడడానికి నిరాకరించారు. ఇరాన్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యం.. ఫుట్‌బాల్ జట్టులోని సభ్యులకు ఇంకా, కొంతమంది అభిమానులను కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

ఇరాన్ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్న దృశ్యం..


కాగా, అహ్మద్ బిన్ అలీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వేల్స్‌పై ఇరాన్ 2-0 తేడాతో గెలిచింది.  అయితే మ్యాచ్ ప్రారంభం కాకముందు ఇరాన్ ప్రభుత్వ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య నిరసన యుద్ధం జరిగింది. ఇరాన్ దేశంలోని విబేధాలు ఖతర్‌కలోనూ కనబడుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..