ఇరాక్​లోని అమెరికా మిలటరీ బేస్ క్యాంప్‌లపై క్షిపణుల దాడులు!

|

Jan 08, 2020 | 11:17 AM

చెప్పినట్లుగా ఇరాన్, అమెరికాపై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. తాజాగా యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని అమెరికా సైనికులు ఎవరైనా చనిపోయారా  అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అన్నవిషయంపై యుద్దమేఘాలు కమ్ముకునే అవకాశం […]

ఇరాక్​లోని అమెరికా మిలటరీ బేస్ క్యాంప్‌లపై క్షిపణుల దాడులు!
Follow us on

చెప్పినట్లుగా ఇరాన్, అమెరికాపై ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. తాజాగా యు.ఎస్ దళాలు ఉన్న రెండు ఇరాకీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను పేల్చింది. పెంటగాన్ ఈ దాడిని ధృవీకరించింది. కాని అమెరికా సైనికులు ఎవరైనా చనిపోయారా  అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరానియన్ జనరల్ ఖాసేం సోలైమాని హత్యకు మొదటి ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తాడు అన్నవిషయంపై యుద్దమేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. దాడులపై ట్రంప్‌కు నివేదిక సమర్పిస్తామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. 

పెంటగాన్ కథనం ఇలా ఉంది :

“జనవరి 7 న సాయంత్రం 5:30 గంటలకు ఇరాక్‌లోని యుఎస్ మిలిటరీ, సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను ఇరాన్ నుండి ప్రయోగించారని, అల్-అస్సాద్, ఇర్బిల్.. ఇరాకీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమైంది. నష్టంపై అంచనా వేస్తున్నాం” అని పెంటగాన్ తెలిపింది.