Rohit Sharma Back In Action: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ముంబై జట్టు ఫిజియోలు అతడ్ని పర్యవేక్షిస్తున్నారట. ఇక తాజాగా హిట్‌మ్యాన్ మరోసారి నెట్స్‌లో కనిపించాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ల బౌలింగ్‌లో అన్ని వైపులా షాట్స్ ఆడాడు.
కాగా, లీగ్ స్టేజిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హిట్‌మ్యాన్ స్థానంలో కీరన్ పొలార్డ్ ముంబై జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా పొలార్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.
On a Ro-ll in the nets ?#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/phqdGhFE4c
— Mumbai Indians (@mipaltan) November 2, 2020