ఢిల్లీ ‘సూపర్’ విజయం

|

Sep 21, 2020 | 12:16 AM

ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో అసలైన ఐపీఎల్ మజా ఏంటో  తెలిసింది.

ఢిల్లీ సూపర్ విజయం
Follow us on

ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో అసలైన ఐపీఎల్ మజా ఏంటో  తెలిసింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సూపర్ ఓవర్ లో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. రబాడ వేసిన మొదటి బంతికి రెండు పరుగులు రాబట్టింది. రెండో బంతికి కేఎల్‌ రాహుల్‌, మూడో బంతికి పూరన్‌ ఔట్‌ కావడంతో పంజాబ్‌ చాప్టర్ క్లోజ్ అయ్యింది. 3 పరుగుల టార్గెన్ ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించి సూపర్‌ విక్టరీ అందుకుంది. ఢిల్లీ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(89) ఒంటరి పోరాటం వృథా అయింది.

పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్‌ చేసింది. అయితే వరసగా వికెట్లు కోల్పోవడంతో పెద్ద స్కోర్ ఉండకపోవచ్చని అందరూ భావించారు. కానీ.. మార్కస్ స్టొయినిస్ చివర్లో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 21 బంతుల్లో 53 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక చేజింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 55 పరుగులకే ఐదు వికెట్లు పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక పంజాబ్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడాడు. 60 బంతుల్లో 89 రన్స్ చేసి గెలుపు దగ్గరికి తీసుకువచ్చాడు. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేశారు.చివరి బంతికి జోర్డాన్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టై అయ్యింది. చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను టైగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సూపర్ ఓవర్‌లో విజయం ఢిల్లీ సొంతమైంది.

Also Read : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం