చిదంబరానికి మరో షాక్.. ఐదురోజుల రిమాండ్

| Edited By:

Aug 22, 2019 | 7:38 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. ఈ నెల 26 వరకు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మొదట 14 రోజల కస్టడీ అడగాలని భావించినా.. సీబీఐ అనూహ్యంగా ఐదు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టును కోరింది. దీంతో కోర్టు కస్టడీకీ అంగీకరించింది. చిదంబరం తరపున న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ […]

చిదంబరానికి మరో షాక్.. ఐదురోజుల రిమాండ్
Follow us on

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. ఈ నెల 26 వరకు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మొదట 14 రోజల కస్టడీ అడగాలని భావించినా.. సీబీఐ అనూహ్యంగా ఐదు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టును కోరింది. దీంతో కోర్టు కస్టడీకీ అంగీకరించింది. చిదంబరం తరపున న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, ఇందిరా జైన్‌లు వాదనలు వినిపించారు. కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2007లో ఈ మీడియా గ్రూప్‌కు రూ.305 కోట్ల మేరకు విదేశీ నిధులు వచ్చాయని, ఇందుకు అనుమతులు పి చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో లభించాయని పేర్కొంది. ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం పై కూడా ఆరోపణలు నమోదయ్యాయి.