ఇకపై నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్..!

|

Jan 02, 2020 | 8:51 AM

తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో కావలసిన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇకపై ఇంటర్ ప్రాక్టికల్స్ అన్నింటిని సీసీ కెమెరాల నిఘాలో జరపాలని యోచిస్తున్నారు. ఇకపోతే వాటి ఫుటేజ్‌ను పరీక్ష ముగిసిన తర్వాత కాలేజీల నుంచి తెప్పించుకుని ఇంటర్ బోర్డు కార్యదర్శి పరిశీలించనున్నారు. ఇదే కాకుండా మూల్యాంకన కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ విధానంలో […]

ఇకపై నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్..!
Follow us on

తెలంగాణ ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో కావలసిన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇకపై ఇంటర్ ప్రాక్టికల్స్ అన్నింటిని సీసీ కెమెరాల నిఘాలో జరపాలని యోచిస్తున్నారు. ఇకపోతే వాటి ఫుటేజ్‌ను పరీక్ష ముగిసిన తర్వాత కాలేజీల నుంచి తెప్పించుకుని ఇంటర్ బోర్డు కార్యదర్శి పరిశీలించనున్నారు. ఇదే కాకుండా మూల్యాంకన కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించాలని నిర్ణయించారు.

సుమారు 9,65,493 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా.. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 4వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం 1,517 కేంద్రాలను.. రాత పరీక్షల నిర్వహణ కోసం 1,317 కేంద్రాలను.. వొకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 449 కేంద్రాలను ఇంటర్ బోర్డు గుర్తించింది.