దసరా: ప్రపంచంలోనే ఎత్తైన రావణ విగ్రహ దహనం.. ఎక్కడంటే..?

| Edited By:

Oct 09, 2019 | 12:42 PM

ప్రపంచంలోనే ఎత్తైన రావణ విగ్రహాన్ని భారత్‌లోని ఛండీగర్‌లో నిన్న దహనం చేశారు. 66 అడుగుల పొడవైన కిరీటంతో.. ఈ విగ్రహం 221 అడుగుల ఎత్తు ఉంది. ఈ విగ్రహాన్ని పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బదనౌరి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చారు. ఈ కార్యక్రమంలో.. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భారదేశ వ్యాప్తంగా దసరా సంబరాలు పెద్దఎత్తున జరిగాయి. దసరా పండుగ రోజున సాధారణంగా.. రావణుడిని బొమ్మ తయారు చేసి.. దాన్ని దహనం చేస్తారు. అలాగే.. చండీగర్‌లోని […]

దసరా: ప్రపంచంలోనే ఎత్తైన రావణ విగ్రహ దహనం.. ఎక్కడంటే..?
Follow us on

ప్రపంచంలోనే ఎత్తైన రావణ విగ్రహాన్ని భారత్‌లోని ఛండీగర్‌లో నిన్న దహనం చేశారు. 66 అడుగుల పొడవైన కిరీటంతో.. ఈ విగ్రహం 221 అడుగుల ఎత్తు ఉంది. ఈ విగ్రహాన్ని పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బదనౌరి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చారు. ఈ కార్యక్రమంలో.. ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

భారదేశ వ్యాప్తంగా దసరా సంబరాలు పెద్దఎత్తున జరిగాయి. దసరా పండుగ రోజున సాధారణంగా.. రావణుడిని బొమ్మ తయారు చేసి.. దాన్ని దహనం చేస్తారు. అలాగే.. చండీగర్‌లోని ధనాస్‌ కాలనీలోని పరేడ్ గ్రౌండ్‌లో రావణుడి భారీ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. దాదాపు 221 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దిష్టి బొమ్మ భారతదేశంలోనే అన్నింటికంటే పెద్దది. ఈ దిష్టిబొమ్మను తయారు చేయడానికి 12 గంటలు పట్టింది.. ఇది ఏకంగా 70 క్వింటాళ్ల బరువు ఉంది. దీనికి పార్వతి దళ్ సేవా సంస్థ.. ఆర్థికంగా సహాయం చేసింది.

కాగా.. ఈ భారీ రావణ దిష్టి బొమ్మ మొక్క మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బొమ్మ కన్నులు చాలా పెద్దగా తయారు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచైనా.. దిష్టిబొమ్మను చూస్తే.. ఆ కళ్లు మనల్ని చూస్తున్నాయా అన్నట్టుగా కనిపిస్తాయి.