ప్రపంచమంతా వ్యాక్సిన్ పంపిణీ చేసే సత్తా భారత్‌కి మాత్రమే ఉంది

| Edited By:

Jul 17, 2020 | 7:51 AM

కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలన్నింటికి పంపిణీ చేయగల సత్తా భారత్‌కి మాత్రమే ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు

ప్రపంచమంతా వ్యాక్సిన్ పంపిణీ చేసే సత్తా భారత్‌కి మాత్రమే ఉంది
Follow us on

కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలన్నింటికి పంపిణీ చేయగల సత్తా భారత్‌కి మాత్రమే ఉందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌లో ఎన్నో ట్రయల్స్‌ పూర్తి అయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా భారత ఫార్మా పరిశ్రమకు మాత్రమే ఉందని ఆయన కొనియాడారు. ‘కోవిడ్‌–19: వైరస్‌పై భారత్‌ యుద్ధం’ పేరుతో ఓ‌ ఛానల్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడారు.

అతి పెద్ద దేశం, ఎక్కువ జనాభా వంటి అంశాలు ఉన్నప్పటికీ కరోనా వైరస్‌తో భారత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని  ఆయన అన్నారు. ”భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్‌, వ్యాక్సిన్‌ కంపెనీలు ప్రపంచమంతా వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. అక్కడి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ చాలా పెద్దది” అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బయోటెక్నాలజీ శాఖలో బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కూడా భాగస్వామిగా ఉందని ఆయన వివరించారు. తమ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బీహార్‌లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని బిల్‌ గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు.