దేశంలో కోరలు చాస్తున్న కరోనా..!

|

Jun 09, 2020 | 7:48 PM

దేశ వ్యాప్తంగా కరోని విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది

దేశంలో కోరలు చాస్తున్న కరోనా..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోని విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు.

మంగళవారం ఒక్కరోజు తమిళనాడులో రికార్డు స్థాయిలో 1,685 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క చెన్నై నగరంలోనే 1,242 కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,914కు చేరింది. ఇక కరోనా మహమ్మారి ధాటికి ఇవాళ మరో 21 మంది మృతి చెందగా.. దీంతో మొత్తం మృతుల సంఖ్య 307కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులకు సంబంధించి 16,279 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 18,325 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర రాజధానిలో చెన్నైలో అత్యధికంగా 24,545 మంది కరోనా బారినపడ్డారు.

అటు కేరళలో మంగళవారం కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,231కి చేరింది. మరోవైపు 848 మంది కొవిడ్‌ నయమై ఇళ్లకు చేరుకున్నారు.

కర్ణాకటలో మంగళవారం కొత్తగా నమోదైన 161 కేసులతో కలిపి 5,921 కరోనా పాజిటివ్‌ కేసులకు చేరింది. ఇవాళ కరోనా బారిన పడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 66కి పెరిగింది. ప్రస్తతం రాష్ట్ర వ్యాప్తంగా 3,248 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలకుని 2,605 మంది డిశ్ఛార్జి అయ్యారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 437గా ఉంది. ఇందులో 184 యాక్టివ్‌ కేసులు కాగా, 237 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు.

ఇక చండీగఢ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 323కి చేరింది. ఇందులో ఈ రోజు నమోదైనవి ఐదు కేసులు. ఇక ఇప్పటివరకు 285 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. కరోనాతో ఐదుగురు చనిపోయారు.